విషమించిన వాజపేయి ఆరోగ్యం…రేపటి బీజేపీ కార్యక్రమాలు రద్దు

Modi Visits AIIMS to Enquire About Atal Bihari Vajpayee's Health

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని తెలుస్తోంది.ఆయన కొద్దీ రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో జూన్ 12వ తేదీన జాయిన్అయ్యారు. అప్పటి నుంచు ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల సంబంధ వ్యాధితో ఆయన తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ రోజు ఆయన పరిస్థితి మరింత క్షిణించింది. దీంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ కి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితం మోడీ కూడా ఆయనని ఎయిమ్స్ లో సందర్శించడం ఇప్పుడు బీజేపీ శ్రేణులకు అనుమానాలు రేకెత్తిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు రేపు బీజేపీతన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Modi And Amith Shaw