మోదుగులకు టైమొచ్చేసిందా..?

modugula venugopala reddy comments on chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఐవైఆర్ కృష్ణారావుపై వేటు వేసిన తర్వాత కూడా టీడీపీలో క్రమశిక్షణ దారికి రావడం లేదు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అధినేతకు అసహనం తెప్పిస్తున్నారు. ఓవైపు పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని బాబు గొప్పగా చెబితే… అదే వేదికపై ఆయన ముందే ఇచ్చిన అప్లికేషిన్లెన్ని, ఆమోదించినవెన్ని అంటూ మోదుగుల పెడసరంగా మాట్లాడటం టీడీపీ నేతలకు కోపం తెప్పిస్తోంది.

పార్టీ బలంపై గెలిచిన మోదుగుల… నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఏపీ సీఎం దగ్గర చాలా కంప్లైంట్లు ఉన్నాయి. శిశుపాలుడ్ని వంద తప్పుల దాకా భరించినట్లు… బాబు కూడా మోదుగులను సహిస్తున్నారనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సగం మందికి సీట్లు దక్కవని చంద్రబాబు సన్నిహితులతో చెప్పారట. గతంలో 1999 ఫార్ములానే మరోసారి ప్రయోగించబోతున్నారు బాబు. అందుకే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినై సైలంట్ గా ఉన్నారు.

కానీ సైలెన్స్ అన్నింటికంటే భయంకరమైనదనే నిజం టీడీపీ నేతలకు అంతుబట్టడం లేదు. జేసీ దివాకర్ రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇంకా మరికొందరు పార్టీ లైన్ దాటిన వారెవరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు. ఇది టీడీపీ వర్గాల మాట. అదే నిజమైతే టీడీపీ తరపున పోటీకి భారీగా ఆశావహులు ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు పని చేయకుండా ప్రభుత్వాన్ని తిట్టేసి పబ్బం గడుపుకుందామని చూడటంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది.