“ఒడియన్” మరి ఇంతలా అయ్యిందేంటి…?

Mohanlal Fantasy Film Is A Missed Opportunity

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఓడియన్ చిత్రం మలయాళం, తెలుగు లో విడుదల చేశారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చారు. సినిమా ప్రమోషన్స్ కూడా ఈ రెండు రాష్ట్రాలలో భాగా చేశారు. మలయాళంలో ఈ సినిమా పైన ఓ టాక్ కూడా వినబడుతుంది. బాహుబలి చిత్రం రికార్డ్స్ బద్దలు కొడుతుందని అక్కడ అంచనాలు వేశారు. మంచి పబ్లిసిటీ దక్కించుకున్న ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అందరు ఉహాలను తారుమారు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ల పడింది. బాహుబలి చిత్రం రేంజ్ లో ఉంటుందని భాగా ప్రచారం చెయ్యడంతో ఓడియన్ సినిమా టికెట్స్ హాట్ కేక్ ల అమ్ముడు పోయాయి.

Mohanla-Odiyan-Telugu-Movie

ఓడియన్ చిత్రం మాత్రం మలయాళం, తెలుగు లో బొక్క బోర్ల పడింది. ఈ చిత్రం పైన మలయాళం, తెలుగు సినిమా ప్రేమికులు ట్రోల్ చేస్తున్నారు. ఓడియన్ చిత్రం బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కోటడం కాదు అసలు ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడన్న తిరిగి వస్తుందా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మోహన్ లాల్ అంటే పడనివారు యష్ ట్యాగ్ యాంటి మోహన్ లాల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పేజి నడుస్తుంది. ఓడియన్ చిత్రం వలన నిర్మాతలు తీవ్రంగా నస్తాపోయరంటు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో థగ్స్ అఫ్ హిందూస్తాన్ అయితే, మలయాళంలో మాత్రం ఓడియన్ చిత్రంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు అంత పెద్ద స్కోప్ లేని చిత్రానికి అంత బడ్జెట్ అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.