ఎన్టీఆర్‌ చావుకు బాబే కారణం… భోరున విలపించిన మోత్కుపల్లి

Motkupalli Narasimhulu cries at NTR Ghat

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సీఎం చంద్రబాబుపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం అని ఆరోపించారు. చంద్రబాబునాయుడిని దొరకని దొంగగా అభివర్ణించారు మోత్కుపల్లి. ఇటీవలి కాలంలో పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మోత్కుపల్లి ఈ రోజు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన విమర్శల పర్వానికి తెరతీయడానికి ఆయన ఎన్టీఆర్ జయంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ ను వేదికగా ఎంచుకున్నారని అనిపిస్తోంది. బాబు తనను దగా చేశారంటూ మోత్కుపల్లి నర్సింహులు బోరున విలపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ స్మృతి చిహ్నం వద్ద నివాళులర్పించిన మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. చంద్రబాబు తనను గవర్నర్ చేస్తానని… ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తానని చెప్పి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించారు. హోదాపై నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు హోదా నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కుట్ర, ద్రోహం అన్నవి చంద్రబాబు నైజాలని అన్నారు. చంద్రబాబుకు ఓటేయవద్దు ఓడించండని ఏపీ ప్రజలకు పిలుపు నిచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అవసరమైతే ఏపీలో తాను రథ యాత్ర చేస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వద్ద నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగతనం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. చివరకు కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపాడని దగ్గుబాటి , నందమూరి హరికృష్ణను చంద్రబాబు వాడుకొని వదిలేశారని చంద్రబాబు పెద్ద నటచక్రవర్తి. మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని విమర్శించారు. చంద్రబాబులో మార్పు వస్తుందని ఇప్పటి వరకు భావించానని… అది సాధ్యం కాదని తెలుసుకున్నానని అన్నారు.