గత కొద్దిరోజులుగా తెలంగాణా టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు జనసేనలో చేరుతున్నారని, ఆయన్ని ఆ పార్టీ తెలంగాణా అధ్యక్ష్యుడుగా ప్రకటించి కుదిరితే సిఎం అభ్యర్ధిగా కూడా ప్రకటించే అవకాసం ఉందని వార్తలు హల్చల్ చేసాయి. అయితే ఆ వార్తలా మీద నిన్న ఆయన స్పందించారు, తన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్న ఒక చానల్ తో మాట్లాడిన ఆయన తాను ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని కానీ ఒకవేళ ఏదైనా ఒక పార్టీలో చేరుతునన్నని అంటే అది తనకు గౌరవం ఇచ్చే పార్టీలో మాత్రమె చేరతానని, లేదు అంటే తనను గుండెల్లో పెట్టుకుని 6సార్లు గెలిపించిన ఆలేరు నుంచి ఇండిపెండెంట్‌గా అయినా బరిలోకి దిగుతానని ఆయన చెప్పుకొచ్చారు. జనసేనలో చేరతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎవరో కావాలనే తన లక్ష్యాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మోత్కుపల్లి. చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగే వాటి కోసం పవన్, జగన్‌లను త్వరలోనే కలుస్తానని ఓ మిత్రుడిగా వారికి సాయం చేయాలనుకుంటున్నానని, బాబును ఓడించడానికి చివరి వరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.