ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా వైరస్ ఇండియాలో కూడా వీరవిహారం చేస్తుంది. ఇప్పటికే ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 500 దాటాయి. పేద, ధనిక అన్న తారతమ్యాలు లేకుండా అది అంటుకుంటుంది. ఓ భయంకరమైన అంటువ్యాధిగా అవతరించి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. దక్షిణాదిలో కర్ణాటకకు కరోనా వణికిస్తోంది. కర్ణాటకలో మొత్తం ఇప్పటివరకు 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా బెంగళూరు నగరంలో ఈ కేసులు అధికంగా ఉండటంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. నిన్నటి నుంచి కర్ణాటక లాక్ డౌన్ ను ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలోనిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా వెల్లడించింది కూడాను. ఇక ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎంపీ కూతురుకు కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రం మరింత అప్రమతమైంది. ఈ మధ్యనే ఆమె గయానా నుంచి ఇండియాకు వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. కాగా భారత ప్రభుత్వం ఈరోజు నుంచి 21 రోజులపాటు ఇండియా మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ 21 రోజులు ఎవరూ బయటకు రాకూడదని కూడా మోడీ హెచ్చరికలు జారీ చేశారు.