విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

వైఎస్సార్‌సీపీ నాయకురాలు , మాజీ మంత్రి విడదల రజిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తానేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని, తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని, మావాళ్ళకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదని అన్నారు. ఫోన్‌ డేటా, భూముల విషయాలపై ఆరోపణలు చేశారని, 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నామని, ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు.