జిన్నారంలో అరెస్ట్ చేసిన వారి పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కిషన్‌గంజ్ పేరుతో జిన్నారం మదర్సాలో ఉంటున్నది ఎవరని ప్రశ్నించారు. జిన్నారంలోని కోదండ రామాలయం భూముల్లో అక్రమంగా మదర్సా నిర్మించారని ఆరోపించారు. జిన్నారంలో అక్రమ అరెస్టులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిన్నారం వ్యవహారంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.



