రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఎంపీలు

రాష్ట్రపతి భవన్‌లో విందు
రాష్ట్రపతి భవన్‌లో విందు

ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల ఎంపీలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్పాహార విందు ఇచ్చారు. సోమవారం అంటే.. మార్చి 17వ తేదీన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న ఎంపీలంద‌ర్నీ క‌లిసి.. వారి వారి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ విశేషాల‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఓం బిర్లా‌తోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.