Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ లక్ష్యం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమన్న మనిషికి అది నెరవేరినప్పుడు ఎలా ఉంటుంది ? చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. మొహం వెలిగిపోతుంది. మాటల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. కనిపించిన వాళ్ళతో స్వీట్స్ పంచి మరీ తమ సంతోషాన్ని వెళ్లబుచ్చుతారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో బిల్లు పెట్టాక అదే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన ముద్రగడ మోహంలో పైన మనం చెప్పుకున్న లక్షణాలు ఏమీ కనిపించలేదు. పైగా విషయం మీద సూటిగా మాట్లాడకుండా ఎక్కడెక్కడ విషయాలో ఆయన మాటల్లో దొర్లాయి. ముద్రగడ కి కాపు రిజర్వేషన్ వచ్చినందుకు బాధ ఏమైనా కలుగుతుందా అన్న రీతిలో ఆయన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది.
ఏపీ సర్కార్ ఇంత చేసినా ముద్రగడ మాటల్లో అయోమయం తో పాటు బాబు మీద అక్కసు ఎంత దాచుకుందామన్నా దాగలేదు. రిజర్వేషన్ కి సంబంధించి కేంద్రం లో నడవాల్సిన తంతు బాధ్యత కూడా చంద్రబాబుదే అని చెప్పడానికి ముద్రగడ ప్రయత్నించారు. ఇక కాపుల సంఖ్య తక్కువ చేసి చూపారంటూ ఇంకో విమర్శ కూడా చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కమిషన్ కు నేతృత్వం వహించిన మంజునాధ్ నివేదికలో భిన్న అభిప్రాయం వ్యక్తం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ మిగిలిన సభ్యుల రిపోర్ట్ ఆధారంగా ఇంత నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మీద ఒక్క మంచి మాట చెప్పడానికి ముద్రగడకు నోరు రాలేదు. ఈ టైం లో తాను నిజాయితీపరుడనని, 2004 ఎన్నికల టైం లో ఎంత ఖర్చుతో ఎలక్షన్స్ చేసింది ముద్రగడ చెప్పుకోవడం చూస్తుంటే ఎవరో భుజాలు తడుముకున్నట్టు వుంది. ముద్రగడ ఉద్యమం వైసీపీ స్పాన్సర్ షిప్ లో నడిచిందన్న విషయాన్ని కప్పిపుచ్చుకోడానికే ఆయన ఇలా మాట్లాడి ఉండొచ్చు.ఏదేమైనా కాపు రిజర్వేషన్ బిల్లు తర్వాత ముద్రగడ మొహం మాడిపోయిన విషయం మామూలు జనానికి కూడా బాగానే అర్ధం అయ్యింది.