ఆ ఫోన్ తో ముద్రగడ ముసుగు తొలిగిందా ?

mudragada phone calls to kapu leaders to support YSRCP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పేరుకి కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత అయినప్పటికీ వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ముద్రగడ పద్మనాభం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ. అయితే ఈ విమర్శని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తున్నారు ముద్రగడ. అయితే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ ముసుగు తొలిగినట్టు తెలుస్తోంది. కాకినాడ ఎన్నికల నేపథ్యంలో అక్కడి కాపు కుల నాయకులకి ముద్రగడ నుంచి ఓ ఫోన్ వెళ్లిందట. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ ని ఓడించాలని ముద్రగడ కాపు నాయకులని కోరడంతో పాటు వైసీపీ కి ఓటేస్తే బాగుంటుందని సూచించారట. ఈ సూచనకి కాపు నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యిందట. వారిలో చాలా మంది వైసీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్ గురించి ఎక్కడైనా హామీ ఇచ్చారా అని నిలదీశారట. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక ముద్రగడ సతమతం అయ్యారట.

ముద్రగడ చేసిన ఫోన్ కాల్ ని ఓ కాపు నేత రికార్డు చేసి తన సన్నిహితులకు వినిపించడంతో ఈ విషయం బయటికి వచ్చిందట. ఈ విషయం ఆనోటాఈనోటా పాకి ముద్రగడ కి కూడా తెలిసిపోయిందట. దీంతో ఆ రికార్డు అయిన ఫోన్ సంభాషణ బయటికి వస్తే తాను ఇప్పటిదాకా వేసుకున్న ఉద్యమ ముసుగు తొలిగిపోయి వైసీపీ ముద్ర బయట పడుతుందని హడలిపోతున్నారట.

మరిన్ని వార్తలు:

సాక్షికి జేమ్స్ బాండ్స్ కావాలి.

200 నోట్లు వచ్చేది ఎప్పుడంటే ?

ఆ సెక్స్‌ రాకెట్‌తో ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధం!