రేపు బిగ్‌బాస్‌ హౌస్‌కు ముమైత్‌ ఖాన్‌

mumaith khan returns to bigg boss house

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా సిట్‌ ముందు హాజరు అయిన ముమైత్‌ ఖాన్‌ రేపు మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లో జాయిన్‌ అవ్వబోతుంది. మామూలుగా అయితే ఒకసారి బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చిన వారిని మళ్లీ లోనికి అనుమతించరు. కాని ముమైత్‌ ఖాన్‌ పరిస్థితి విభిన్నం. అందుకే బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు ప్రత్యేక పర్మీషన్‌ ఇవ్వడంతో ముమైత్‌ ఖాన్‌ రెండు రోజులు షోకు బ్రేక్‌ తీసుకుని మళ్లీ హౌస్‌లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ముమైత్‌ఖాన్‌తో వచ్చిన వ్యక్తి ఆమెను మళ్లీ హౌస్‌కు స్వయంగా తానే తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రత్యేక షరతులతో ఆమె సిట్‌ విచారణకు హాజరు అయ్యింది. ఆ సందర్బంగా ఆమె ఫోన్‌ను చూడటం లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదా ఇతర ఏ విషయాలపై ఇతరుతో సంభాషించడం చేయకుండా ఆమె వెంట వచ్చిన ఒక వ్యక్తి చూసుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్‌ షో కోసం ఆమె స్టార్‌ మాటీవీతో ఒప్పందంలో ఉంది. కనుక ఆమెను మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లోకి జాయిన్‌ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. విచారణ ముగించుకుని నేరుగా నేడు పుణెకు ఆమె వెళ్లనుంది. రేపు ఉదయం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బిగ్‌బాస్‌ షోలో ముమైత్‌ ఖాన్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అందుకే ఆమెను మళ్లీ తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. నేడు లేదా రేపు ప్రసారం అయ్యే షోలో ఆ విషయం వెళ్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

డ్రగ్స్‌ ఇష్యూ : ఛార్మిలో వర్మకు ఆ యాంగిల్‌ కనిపించిందట

గౌతమ్ నంద …తెలుగు బులెట్ ప్రివ్యూ.