Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి కొంచెంలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఒక లారీ ఢీ కొట్టడంతో ఆయనకీ ప్రమాదం సంభవించింది అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం తప్పింది. అయితే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుండిగోషామహల్ శాసనసభ్యునిగా ఎన్నికయిన రాజసింగ్ ముస్లింలకి బడ్డ వ్యతిరేకి అన్న ముద్ర వేయించుకున్నారు. ఆయన ఎప్పుడు హిందూ మత ప్రాముఖ్యత కోసం పాటుపడుతుంటారు. ఈ క్రమంలో ముస్లిం లకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు సైతం చేసి వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరు పొందారు. నిన్న కూడా ఆయన మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఒక సభలో పాల్గొని తన కారులో హైదరాబాదుకి పయనమయ్యారు. అయితే ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్లు వచ్చాక ఆయన కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా… కారు డ్రైవర్ అప్రమత్తతో రాజాసింగ్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారు కావడంతో… లారీ క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ప్రమాదానికి పథకం వేసి ఉండొచ్చునని ఆయన భావిస్తున్నారు. లారీతో తన కారును ఢీకొట్టాలని చూశారని ఆయన ఆరోపించారు. తన కారు డ్రైవర్ అప్రమత్తత వల్లే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని రాజాసింగ్ తెలిపారు. ఔరంగాబాద్-బీడ్ పర్యటకు వెళ్లే ముందు తనకు ప్రాణహాని ఉందని… చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన చేసిన ఆరోపణలకి ఈ హత్యయత్నం ! బలం చేకూరుస్తుంది. రాజాసింగ్‌పై ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నం జరిగినట్లు బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం గురించి పోలీసు విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.