కష్టపడకుండా డబ్బులు సంపాదించేందుకు వేసుకున్న ఆడవేషమే అతడి పాలిట మృత్యువైంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో మహిళగా వేషం మార్చుకున్న ఆ యువకుడిని, తన కామవాంఛ తీర్చేందుకు రూ. 400తో బేరం కుదుర్చుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ఆడ కాదు మగ అనే విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహంతో దారుణంగా హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అందుతున్న సమాచారం ప్రకారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన మంద అర్జున్ ఆడవేషం కట్టి విటులను ఆకర్షించి డబ్బు సంపాదించేవాడు.
ఈ పనే చివరికి అతడి ప్రాణం తీసింది. లైంగిక వాంఛ తీర్చుకునేందుకు అతడితో ఓ వ్యక్తి బేరం మాట్లాడుకున్నాడు. తీరా పని మొదలెట్టాక అతడు ఆమె కాదు అతడని తెలుసుకున్న విటుడు ప్రాణం తీశాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద నెల రోజుల క్రితం జరిగిన ఈ హత్యకేసును పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన భరత్‌లాల్ రాయ్ పోలెపల్లి సెజ్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లైంగిక కోరిక తీర్చుకునేందుకు ఫిబ్రవరి 10న రాత్రి 9:30 గంటల సమయంలో హైవే పైకి వచ్చాడు. ఆడవేషంలో ఉన్న అర్జున్ తో బేరం మాట్లాడుకుని బూరెడ్డిపల్లి వద్ద పొదల్లోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే తాను బేరం మాట్లాడుకుంది మహిళతో కాదు మగాడితో అని తెలుసుకున్న భరత్ లాల్ ఆగ్రహంతో అర్జున్ తల పగలకొట్టాడు. ఆ తర్వాత చున్నీతో గొంతు నులిచి చంపేసి అతడి ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అర్జున్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా భరత్‌లాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.