వైష్ణవిది హత్య కాదు… రేప్ చేసి చంపేశారు… సంచలనం!

murder turned rape case at meerpet

నిన్న హైదరాబాద్ లోనే మీర్ పేటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైష్ణవి కేసులో కొన్ని సంచనల విషయాలు బయటకు వచ్చాయి. ముందు మిస్సింగ్ కేసుగా ఉన్న ఆమె కేసు, మృతదేహం దొరికాక దానిని అనుమానాస్పద మృతి కేసుగా మార్చారు. దీంతో దర్యప్తు మొదలుపెట్టిన పోలీసులకి కొన్ని కీలక విషయాలు తెలిసాయి. వాకింగ్ కు వెళ్లి కనపడకుండా పోయిన వైష్ణవిని అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తల, ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలున్నాయి. దీంతో దుండుగులు అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ విషయం నిర్ధారణ కానుంది.

vaishnavi rape case

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ బ్రహ్మణపల్లికి చెందిన అనసూయ, ప్రభు కుటుంబం బ్రతుకు దెరువు కోసం హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. బడంగ్‌పేటలోని రాజీవ్‌ గృహకల్ప 10వ బ్లాక్‌లో మూడేళ్లుగా ఉంటున్నారు. వీరి కూతరు వేవూరి వైష్ణవి (14) జిల్లెలగూడలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. రోజూలాగే ఆదివారం ఉదయం ఆరు గంటలకు వాకింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తల్లి అనసూయ తెల్లవారాక ముందే తన డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆమె భర్త కూడా తన పనికి తానూ వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అనసూయ కూతురు కనిపించకపోవడంతో విషయం భర్తకు తెలిపింది. దీంతో వీరు స్థానికులతో కలసి వైష్ణవి స్నేహితులను, బంధువులను కనుక్కునా జాడ తెలియలేదు.

vaishnavi

దీంతో రాత్రి ఏడు గంటలకు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం ఆరు గంటలకు రాజీవ్‌ గృహకల్పలోని అంగన్‌వాడీ భవనం పక్కన ఉన్న చర్చీ దగ్గర ఓ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనసూయ, ప్రభు దంపతులకు విషయాన్ని తెలియజేశారు. వారు అక్కడి వెళ్లి చూడగా తల, ముఖం, శరీరంపై తీవ్రగాయాలతో వైష్ణవి జీవచ్ఛవంగా పడి ఉంది.ఆ దేహాన్ని పరిశీలించిన పోలీసులు దుండగులు వైష్ణవిని ఉదయాన్నే కిడ్నాప్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు.

 

vaishnavi

అత్యాచారం చేసిన అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను నీటిలో ముంచి శ్వాస ఆగిపోయేలా చేసి చంపినట్లు ఆ సమయంలో జరిగిన పెనుగులాట వలన శరీరంపై తీవ్ర గాయాలై ఉంటాయని చనిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని ఆటోలో తీసుకువచ్చి డ్వాక్రా భవనం పక్క న పడేసి వెళ్లిపోయి ఉండచ్చని భావిస్తున్నారు. డ్వాక్రా భవనం పక్కనే కమ్యూనిటీ చర్చి ఉంది. చర్చికి నలువైపుల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే దుండగులకు ఈ సీసీ కెమెరాల సంగతి ముందే తెలిసి ఆటోను చర్చి ముందు నుంచి కాకుండా వేరే వైపు నుండి వచ్చి అదేదారిలో వెనక్కి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. అంటే రాజీవ్‌ గృహకల్పలో ఉండే వారేగాక ఆ ప్రాంతం గురించి తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, ఇది కచ్చితంగా తెలిసిన వారి పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో ఆటో టైర్ల అచ్చులను గమనించిన పోలీసులు ఓ ఆటోవాలాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

vaishnavi murder  case