ఓటిటి కి నో చెప్పిన మన్మధుడు

ఓటిటి కి నో చెప్పిన మన్మధుడు

సినిమా థియేటర్లు మూసి వుండడంతో, ఒకవేళ థియేటర్లు తెరిచినా మునుపటి మాదిరిగా జనం థియేటర్లకు వస్తారనే నమ్మకం లేకపోవడంతో నిర్మాతలు ఓటిటి రిలీజ్‍కి హీరోలని ఒప్పించేస్తున్నారు. అలాగే ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ సంగతి కూడా చూడాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఇందునిమిత్తం నాగార్జునకు కాల్‍ చేయగా… అలాంటి ఆలోచనే వద్దని చెప్పేసారట. అసలే అఖిల్‍కి ఇంతవరకు హిట్‍ లేదు. ఇప్పుడు అతడి సినిమా థియేటర్లో కాకుండా ఓటిటిలో రిలీజ్‍ అయితే ఇక అతనికి కచ్చితమైన మార్కెట్‍ ఏర్పడదు.

పైగా తదుపరి చిత్రాలను కూడా ఓటిటిలో విడుదల చేయాలనే ఆలోచనను నిర్మాతలు చేయవచ్చు. అందుకే ఆ రిస్క్ తీసుకునేందుకు నాగార్జున ససేమీరా అనేసారట. ఒకవేళ ఆర్థిక భారమయితే తాను కూడా భాగం పంచుకుంటాను గానీ థియేటర్లు తెరుచుకున్న తర్వాతే సినిమా విడుదల చేయాలని చెప్పారట. ఒకవేళ సంక్రాంతికి విడుదల చేయడం కుదరకపోతే వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చు కానీ ప్రత్యామ్నాయాల కోసం చూడవద్దని ఖచ్చితంగా చెప్పడంతో ఇక ఆ నిర్మాతలు షూటింగ్‍ త్వరగా మొదలు పెట్టి, ముగించేద్దాం అనే తొందర కూడా లేకుండా పరిస్థితి మామూలు అయ్యేవరకు వేచి చూడాలని డిసైడ్‍ అయ్యారట.