ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్రలో స్టార్స్ కనిపించబోతున్న కారణంగా సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా చంద్రబాబు నాయుడు పాత్రను రానాతో చేయిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారు. సినిమాలో ప్రముఖుల పాత్రలను స్టార్స్‌తో చేయిస్తున్న కారణంగా సినిమాపై సాదారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం నాగబాబును ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ఎన్టీఆర్ సినీ కెరీర్ సమయంలో స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన ఎస్వీ రంగారావు పాత్రను నాగబాబుతో చేయించాలని క్రిష్ భావిస్తున్నాడు. అందుకు నాగబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో నాగబాబు అయిదు నుండి పది నిమిషాల వరకు కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం చాలా అద్బుతంగా తెరకెక్కుతుందనే నమ్మకంతో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా క్రిష్ ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రంలో దివంగత హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్ పోషించబోతున్న విషయం తెల్సిందే.