రాంప్ వాక్ తో అదరగొట్టిన నాగ చైతన్య సమంత

Naga chaitanya Samantha attended Woven 2017 Fashion Show

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భార్యాభ‌ర్త‌లు ఒక‌రి అభిరుచులు మ‌రొక‌రు గౌర‌వించుకుంటూ ముందుకుసాగితే కుటుంబంలో అంత‌కుమించిన ఆనందం మరొక‌టి ఉండ‌దు. త్వ‌ర‌లోనే పెళ్లితో  ఒక్క‌టి కాబోతున్న టాలీవుడ్ ప్రేమ జంట నాగ‌చైత‌న్య‌, స‌మంత అలాంటి  కోవ‌లోకే వ‌స్తారు. ప్రేమ‌లో ప‌డింది మొదలు ఇప్ప‌టిదాకా వారిద్ద‌రూ ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకుంటూ, ఒకరికొక‌రు వెన్నుద‌న్నుగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. నాగ‌చైత‌న్య స‌మంతకు అన్నివిష‌యాల్లో చేదోడువాదోడుగా ఉంటూ ప్రోత్సాహాన్నిస్తుంటారు. అందుకే చై తో ఎంగేజ్ మెంట్ త‌ర్వాతా స‌మంత కెరీర్ లో ఎలాంటి మార్పులూ రాలేదు. ముందులానే సినిమాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, త‌న‌కిష్ట‌మైన వ్యాపకాలు కొన‌సాగిస్తున్నారు.

ప్ర‌స్తుతం స‌మంత రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, రాజుగారి గ‌ది -2 సినిమాల్లో న‌టిస్తున్నారు. నాగ‌చైత‌న్య యుద్ధం శ‌ర‌ణంలో న‌టిస్తున్నారు. చందుమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేసేందుకు అంగీక‌రించారు. సినిమాల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్లో ఏమో ఎంగేజ్ మెంట్ త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి క‌నిపించింది త‌క్కువే. సోమ‌వారం మాత్రం వారిద్ద‌రూ క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం వొవెన్ 2017 అనే కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. తెలంగాణ చేనేత ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హిర‌స్తున్న స‌మంత ఈ కార్య‌క్ర‌మానికి నాగ‌చైత‌న్య‌తో క‌లిసి హాజ‌ర‌యింది. ఇద్ద‌రూ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని కార్య‌క్ర‌మాన్ని తిల‌కించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో వారిద్ద‌రూ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు.

నాగ‌చైతన్య చేనేత‌వ‌స్త్రంతో త‌యారుచేసిన షేర్వాణి ధ‌రించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఫొటోను స‌మంత ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ… నా ప్రేమ‌, జీవిత‌మైన  చై కి ధ‌న్యవాదాలు అని కూడా రాసింది. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల అన్యోన్య‌త‌పై అటు అక్కినేని కుటుంబం, ఇటు చైత‌న్య‌ను పెంచి పెద్ద చేసిన రామానాయుడి కుటుంబం చాలా సంతోషంగా ఉంద‌ట‌. అక్టోబ‌రు ఆరున గోవాలో నాగ‌చైత‌న్య‌, స‌మంత వివాహాన్ని గ్రాండ్ గా జ‌రిపించేందుకు నాగార్జున సిద్ధ‌మ‌వుతున్నారు. మూడురోజుల పాటు హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల ప్ర‌కారం వీరి పెళ్లివేడుక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం.

 

మరిన్ని వార్తలు:

మెగా ‘ఖైదీ’ రికార్డుపై ‘ఫిదా’ కన్ను

నా భర్త పరమ నీచుడు..!

నిఖిల్ పెళ్లి కొడుకు అవుతున్నాడోచ్.