జంటగా భారీ డిమాండ్‌..!

Naga Chaitanya Samantha Remuneration for Siva Nirvana Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ‘నిన్ను కోరి’ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. అతి త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా చిత్ర నిర్మాతలు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు వచ్చిన రకరకాల పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. అతి త్వరలోనే చైతూ, సమంతల కాంబోలో నాల్గవ సినిమా రాబోతుందని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ చిత్రంకు వీరిద్దరు తీసుకోబోతున్న పారితోషికం విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

మామూలుగా అయితే నాగచైతన్యకు 2.5 నుండి 3.5 కోట్ల వరకు పారితోషికం ఉంటుంది. ఇక సమంత 1 కోటి నుండి 1.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. వీరిద్దరి కాంబోకు భారీ డిమాండ్‌ ఉన్న కారణంగా ఏకంగా 7 కోట్ల పారితోషికంను ఈ జంట అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. జంటగా పారితోషికం తీసుకోవడం చాలా అరుదు. టాలీవుడ్‌లో మొదటి సారి నాగచైతన్య, సమంతలు కలిసి జంటగా పారితోషికం అందుకోబోతున్నారు. విడివిదిగా అయితే ఇద్దరి పారితోషికం కలిపి 4 నుండి 5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాని జంటగా నటిస్తున్నారు కనుక 7 కోట్ల పారితోషికంను అందుకుంటున్నారు. వీరిద్దరి జంటకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో ఈ పారితోషికం చూస్తేనే అర్థం అవుతుంది.