Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా నిలబడుతుంది. ఇటీవలే కొందరు వ్యక్తులు పవన్‌పై చేస్తున్న విమర్శలకు నిరసనగా నాగబాబు మరియు అల్లు అరవింద్‌లు మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పవన్ ఫిల్మ్ ఛాంబర్లో పవన్ నిరసన కార్యక్రమానికి కూడా మెగా ఫ్యామిలీ నుండి మద్దతు లభించింది. ముఖ్యంగా నాగబాబు ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలుస్తున్నాడు. తాజాగా ‘నా పేరు సూర్య’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ మరోసారి తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచాడు.
తమ కుటుంబంపై కొందరు కావాలని చేస్తున్న మాట దాడిపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము గతంలో ప్రజా సేవ చేయాలని భావిస్తే కుదరలేదు. కాని ఈసారి ఖచ్చితంగా పవన్ ప్రజా సేవ చేస్తాడని చెప్పుకొచ్చాడు. కొందరు రాజకీయ దురుద్దేశ్యంతో, పవన్‌ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచాడు. పవన్ కోసం తామంత కూడా ముందు ఉంటామని ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ సభ్యులు చెబుతున్నారు.