శ్రీదేవి అకాల మరణం తీరని లోటు : నాగార్జున

శ్రీదేవి అకాల మరణం తీరని లోటు : నాగార్జున

ఆదివారం హైదరాబాద్‌లో ANR నేషనల్ అవార్డ్స్‌ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఈ అవార్డుల ఫంక్షన్‌కి టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా అవార్డు విజేతలకు అవార్డులు అందజేయడం జరిగింది. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖ ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్ అవార్డు స్వీకరించగా, నటి రేఖ స్వయంగా ఈ అవార్డు అందుకుంది.

‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ లాంచ్ వేడుక 02:11 రకుల్ ప్రీత్‌కు నాగార్జున వార్నింగ్ మన్మథుడు2 డైరెక్టర్ క్లారిటీ 29:10 ఈ సినిమాతో నా కొడుకు కోడలికి షాక్ ఇవ్వబోతున్నా  ఈ సందర్బంగా వేదికపై కింగ్ నాగార్జున మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షించింది. శ్రీదేవి, రేఖలతో తనకున్న అనుబంధం గురించి వివరించారు నాగ్. ఈ అవార్డు శ్రీదేవి, రేఖలకు ఇవ్వాలనేది ఏఎన్నార్ కోరిక అని అన్నారు. శ్రీదేవితో తాను నాలుగు సినిమాలు చేశానని, ఆమె ఓ దేవత అని చెప్పారు. శ్రీదేవి అకాల మరణం తీరని లోటు అన్నారు. నటి రేఖ గురించి మాట్లాడుతూ అన్నిరకాల సినిమాలు ఎలా చేశారు, ఎలా అంత సక్సెస్ రేట్‌ను సాధించారో తెలపాలని కోరారు. అలాగే ఆమె అందానికి గల సీక్రెట్ ఏమిటో కూడా అందరికీ తెలియజేయాలని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగ్.