Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ, నాగార్జునల కాంబినేషన్లో వచ్చిన ‘ఆఫీసర్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అని తేలిపోయింది. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లు నెత్తిన గుడ్డ వేసేసుకున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం నష్టపోలేదు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మకు ఈ చిత్రం ద్వారా దాదాపుగా ఆరు కోట్ల మేరకు లాభం దక్కినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా థియేట్రికల్ రైట్స్‌తో పాటు అన్ని రకాల రైట్స్‌ను అమ్మడం ద్వారా పెట్టిన పెట్టుబడికంటే ఎక్కువగానే వచ్చాయి. దాంతో వర్మకు నష్టం లేదని, లాభాలే వచ్చాయి అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ చిత్రంలో నటించినందుకు నాగార్జునకు 5.75 కోట్లను ఇచ్చేందుకు వర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు. సినిమా విడుదల ముందు వరకు కేవలం రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చాడు అని, మిగిలిన మొత్తంను ఆ తర్వాత ఇస్తాను అంటూ హామీ ఇచ్చాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వర్మ ఆ మొత్తం ఇవ్వడం లేదని, నాగార్జున కూడా ఆ మొత్తంను అడగాలని అనుకోవడం లేదని సమాచారం అందుతుంది. మొత్తానికి నాగార్జునకు ఈ చిత్రం వల్ల దాదాపుగా రెండున్నర కోట్ల వరకు నష్టం అంటూ సినీ విశ్లేషకులు లెక్కు చెబుతున్నారు. మొత్తానికి వర్మను నమ్ముకున్నందుకు నాగార్జునకు ఇలా కావాల్సిందే అంటూ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు.