దిల్‌రాజుపై నాగార్జున సీరియస్‌…

Nagarjuna fires on Dil Raju

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అఖిల్‌ రెండవ సినిమా ‘హలో’కు వరుసగా దెబ్బలు తలుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్‌కు యూట్యూబ్‌లో కాపీరైట్‌ పడటంతో టీజర్‌ను డిలీట్‌ చేయడం జరిగింది. దాంతో పరువు పోయి, షాక్‌లో ఉన్న చిత్ర యూనిట్‌ సభ్యులకు తాజాగా మరో షాక్‌ తలిగింది. ‘హలో’కు పోటీగా నాని ‘ఎంసీఏ’ చిత్రం విడుదల కాబోతుంది. ముందుగా అనుకున్న ప్రకారం ‘ఎంసీఏ’ చిత్రం క్రిస్మస్‌కు విడుదల అవ్వాల్సి ఉంది. కాని దిల్‌రాజుతో నాగార్జున మాట్లాడి వారం రోజుల ముందే అంటే డిసెంబర్‌ రెండవ వారంలోనే విడుదల చేసేలా ఒప్పించాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాను అనుకున్న సమాయానికి విడుదల చేయాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నాడు.

నాని, సాయిపల్లవి జంటగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను క్యాష్‌ చేసుకోవాలి అంటే మంచి డేట్‌లో సినిమాను విడుదల చేయాలని దిల్‌రాజు భావిస్తున్నాడు. కాని నాగార్జున ఒత్తిడి మేరకు ముందే విడుదల చేయాలని నిర్ణయించుకుని డేట్‌ను ప్రకటించారు. కాని ముందే విడుదల చేయడం వల్ల సెలవులను మిస్‌ అవుతామనే ఉద్దేశ్యంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేశారు. దాంతో దిల్‌రాజు ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రాన్ని డిసెంబర్‌ 21న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. డిసెంబర్‌ 22న ‘హలో’ చిత్రం విడుదల కానున్న విషయం తెల్సిందే. ఒక్క రోజు ముందు నాని సినిమా విడుదల అయితే ఖచ్చితంగా అది అఖిల్‌ సినిమాకు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అందుకే నాగార్జున ‘ఎంసీఏ’ విడుదలపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 23వ తారీకున అల్లు శిరీష్‌ ‘ఒక్క క్షణం’ విడుదల కాబోతుంది. ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా ‘మిడిల్‌ క్లాస్‌’ అబ్బాయి సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మిగిలిన రెండు సినిమాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది.