నాగ్, వర్మ ఆ రెండు సినిమాలు మర్చిపోయారా, నటిస్తున్నారా?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
విజయానికి అందరూ బంధువులే. అపజయమే అనాధ. ఈ విషయంలో ఎవరూ అతీతులు కాదని అర్ధం అయ్యింది. సినీ రంగంలో కాస్తో కూస్తో హిపోక్రసీ కి దూరంగా వుంటారనుకునే నాగార్జున , రామ్ గోపాల్ వర్మ సైతం ఇదే బాటలో నడిచారు. వీరి కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైన సందర్భంగా 28 ఏళ్ల నాటి శివ ప్రస్తావన పదేపదే తెచ్చిన ఈ ఇద్దరు ఆపై తాము కలిసి పని చేయలేదనే విధంగా బిల్డ్ అప్ ఇచ్చారు. కానీ శివ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. అవే గోవిందా గోవిందా, అంతం. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

Antham and Govinda Govinda Movie

1992 లో దృశ్య క్రియేషన్స్ బ్యానర్ మీద కె. ప్రసాద్ అనే నిర్మాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో నిర్మించిన అంతం సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి గానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే ఆ సినిమాలో నాగ్, ఊర్మిళ మధ్య కొన్ని సీన్స్, పాటలు ఇప్పటికీ కొందరికి అల్ టైం ఫేవరెట్. క్లయిమాక్స్ లో నాగ్ ని చంపటం అప్పట్లో ఓ సంచలనం. ఇక 1994 లో అశ్వనీదత్ , వైజయంతి బ్యానర్ మీద నాగ్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో గోవిందా గోవిందా సినిమా తీశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దోపిడీ చేసే కథతో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే ఈ సినిమాలో కూడా శ్రీదేవి, నాగ్ కాంబినేషన్ లో కొన్ని పాటలు , సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి. కానీ సినిమా ప్లాప్ కావడంతో వీరి కాంబినేషన్ లో ఇంకో ప్రయత్నం జరగలేదు. ఇదిగో ఇన్నాళ్ళకి సినిమా సెట్ అయ్యింది. ఈ సందర్భంలో శివ తప్ప ఈ సినిమాల ప్రస్తావన తేలేదు ఈ ఇద్దరూ. పాత ప్లాప్స్ గుర్తుకు వస్తే కొత్త క్రేజ్ తగ్గిపోతుందని ఈ ఇద్దరూ జాగ్రత్తపడ్డారా లేక మర్చిపోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నారా ? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగింది నాగ్, వర్మ మాత్రమే.