‘హలో’లో వీరు ముగ్గురు ఉన్నారా?

Nagarjuna Samantha and Amala in Hello Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో’. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే నెలలో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తెరకెక్కింది. మొదటి సినిమాతో అఖిల్‌ తీవ్రంగా నిరాశ పర్చాడు. అయినా కూడా నాగార్జున ఈ సినిమాకు భారీ హైప్‌ తీసుకు రావడంలో సక్సెస్‌ అయ్యాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుని సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.

ఇక ఈ చిత్రంపై అంచనాలను మరింతగా పెంచే వార్త ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అఖిల్‌ తల్లి అమల అక్కినేని మరియు తండ్రి నాగార్జునలు కీలక గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇక అఖిల్‌ వదిన సమంత అక్కినేని కూడా ఈ చిత్రంలో కనిపించ బోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ ముగ్గురు అఖిల్‌కు ‘హలో’ చెప్తే సినిమా స్థాయి పెరిగి పోయే అవకాశం ఉంది. సినిమాలో వీరు ముగ్గురు ఉంటే తప్పకుండా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తారు. కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ సభ్యులు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కాబట్టి మౌనం అంగీకారం అంటూ కొందరు నిజంగా ఈ చిత్రంలో వారు ఉన్నరని నమ్ముతున్నారు. అసలు విషయం ఏంటీ అనేది త్వరలో తేలిపోనుంది.