Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన రెండవ చిత్రం ‘హలో’ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టడంలో విఫలం అయ్యింది. నాని ‘ఎంసీఏ’ చిత్రం విడుదలయిన తర్వాత ఒక్క రోజుకు ‘హలో’ చిత్రం విడుదలైన విషయం తెల్సిందే. ‘ఎంసీఏ’ చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో ‘హలో’ సినిమాకు పాజిటివ్‌గా మారి మంచి కలెక్షన్స్ వస్తాయని అంతా భావించారు. కాని ఊహించని విధంగా ‘హలో’ సినిమాకు మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్‌పై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తానికి ‘హలో’ను కొనుగోలు చేయడం జరిగింది. కాని ‘హలో’ సినిమా మాత్రం నిరాశ మిగిల్చింది.
నాగార్జున మంచి మనస్సుతో ‘హలో’ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ను ఆదుకునేందుకు సిద్దం అయినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్లతో నాగార్జున మాట్లాడి అధైర్య పడొద్దని తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అంటూ చెప్పాడట. అఖిల్ మూడవ సినిమా పంపిణీ హక్కులను తక్కువ రేట్లకు ‘హలో’ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నాడు. నాగార్జున తీసుకున్న నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ మరోసారి తన మంచి మనస్సును చాటుకుంది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అఖిల్ మూడవ సినిమా గురించి వచ్చే నెల 10 తర్వాత ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అఖిల్ మూడవ చిత్ర బడ్జెట్‌ను చాలా తగ్గించాలని భావిస్తున్నారు. 20 కోట్ల లోపు బడ్జెట్‌తో అఖిల్3ను పూర్తి చేసే యోచనలో ఉన్నారు.