Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని హీరో నాగార్జున ఇటీవలే ‘ఆఫీసర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడ్డాడు. రామ్ గోపాల్ వర్మపై నమ్మకంతో ఆఫీసర్ చిత్రాన్ని చేసిన నాగార్జునకు తీవ్ర నిరాశ మిగిలింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో వర్మ ఆ చిత్రాన్ని చేస్తున్న సమయంలో నాగార్జున ఎలా ఈ సినిమా ఆడుతుందని భావించాడో అర్థం కావడం లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయడంను పెద్ద తప్పిదం అంటూ అభిమానులు కూడా అంటున్నారు. ఈ సమయంలోనే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది.
నాగార్జున గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. మొదటి సినిమాతోనే కళ్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాన్ని చేయాలని నాగార్జున భావించాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కళ్యాణ్‌ను ఆదేశించాడు. బంగార్రాజు పాత్ర నేపథ్యంలో స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దాదాపు ఆరు నెలలు పలువురు రచయితలతో భేటీ అయ్యాడు. ఇంత చేసినా కూడా నాగార్జునకు ఆ స్క్రిప్ట్ నచ్చలేదు. దాంతో బంగార్రాజును పక్కన పెట్టి నేలటిక్కెట్టు చిత్రాన్ని చేశాడు. రవితేజ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నేటిక్కెట్టు నిలిచింది. ఇలాంటి సమయంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సినిమాను చేసేందుకు ఏ హీరో అయినా జంకుతాడు. కాని నాగార్జున మాత్రం ఇప్పుడు బంగార్రాజు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే సంవత్సరం వేసవిలో బంగార్రాజును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటిక్కెట్టు ఫ్లాప్ అయినా కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించేందుకు నాగార్జున ముందుకు రావడం అక్కినేని ఫ్యాన్స్‌కు కాన్త టెన్షన్ పెడుతుంది.