బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని వుడ్‌లలో కూడా ఈమద్య లైంగిక వేదింపుల గురించిన చర్చ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. లైంగికంగా వేదింపులకు గురయినట్లుగా ఎంతో మంది ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పుకొచ్చారు. అయితే ఈసారి బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్తా చెప్పడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. నానా పటేకర్‌తో మొదలు పెట్టిన ఈమె వరుసగా విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా ఈమె దర్శకుడిపై విమర్శలు చేసింది.
తనను ఒక దర్శకుడు డ్రస్ విప్పి మరీ డాన్స్ వేయమన్నాడు అంటూ చెప్పిన తనూశ్రీ దత్తా ఆ వెంటనే ఆయన పేరును కూడా ప్రకటించింది. వివేక్ అనే దర్శకుడిపై ఈమె తాజా వ్యాఖ్యలతో వివాదం మరింతగా ముదురుతుంది. ఇప్పటికే ఈ అమ్మడిపై నానా పటేకర్ లీగల్ చర్యలకు సిద్దం అయ్యాడు. తాజాగా వివేక్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయన సీరియస్ అవుతున్నాడు. ఒక వైపు తనూశ్రీ దత్తకు పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది. మరో వైపు ఆమెకు వ్యతిరేకంగా కూడా విమర్శలు పెరుగుతున్నాయి. బాలీవుడ్లో ఈ విషయమై రెండు వర్గాలుగా విడిపోయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ వివాదం మరెంతగా ముదురుతుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది.