తలైవా రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ కి వస్తే…నేను మాత్రం షూటింగ్ స్పాట్ కి రావాల్సి వచ్చింది. 2.0 సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అయ్యాను అని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ పెట్టుకొని మరి విచారం వ్యక్తంచేస్తున్నాడు నాని. “నా అభిమాన హీరో రజినీకాంత్” అని గర్వంగా చెప్పుకొనే నాని, రజినీకాంత్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆటకే చూసేవాడంట. కానీ, తాను నటిస్తున్న జెర్సీ సినిమా షూటింగ్ షెడ్యూల్ పీక్ స్టేజిలో ఉండడంతో బంక్ కొట్టి 2.0 సినిమాకి వెళ్లలేని పరిస్థితి పాపం నానిది. రజినీకాంత్ నటించిన 2.0 సినిమా ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా అయిపోవడంతో సినిమా గురించి రివ్యూలు కూడా బయటకి వచ్చేస్తున్నాయి. ఈ సినిమా మీద తెలుగు సినీపరిశ్రమ కి చెందిన రాజమౌళి మరియు ఇతర ప్రముఖులు తమ ట్విట్టర్ పేజీలలో పోస్ట్లు కూడా పెట్టి, చిత్రం టీం కి అభినందనలు అందజేశారు.
అయితే ఈ సినిమాలో రజినీకాంత్ అభినయం హైలైట్ పాయింట్ అవ్వగా, చిట్టి రోబో కి, అక్షయ్ కుమార్ కి మధ్య జరిగే పోరాటదృశ్యాలు అద్భుతమని అందరూ అనుకుంటున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం తో పాటుగా ఈ సినిమాలో మంచి సెంటిమెంట్ మరియు సందేశం కూడా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయం అని తెలుస్తుంది. ఈ సినిమాలో పాటలు లేకపోవడం, రోబో సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్లు, ఎంటర్టైన్మెంట్ ఈ 2.0 సీక్వెల్ లో తగ్గడంతో మాస్ ప్రేక్షకులు ఏమేరకు ఈ సినిమాని ఆదరిస్తారో అనే సందేహం వెల్లువెత్తుతోంది. కానీ, సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా అలరించడం ఖాయం అని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Thalaivar arrived at BOXOFFICE .
Me arrived at the shooting spot .
Missing first day first show 😏#2point0— Nani (@NameisNani) November 29, 2018