Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాని ఇటీవలే ‘నేను లోకల్’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత నాని ‘నిన్ను కోరి’ చిత్రాన్ని చేశాడు. తనతో ‘జెంటిల్మన్’ చిత్రాన్ని చేసిన నివేదా థామస్‌తో ఈ చిత్రంలో రొమాన్స్ చేశాడు. ఈ చిత్రంలో తమిళ హీరో ఆది ముఖ్య పాత్రను చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలను మాంతం పెంచింది. ఎంత సినిమాపై అంచనాలున్నా కూడా పబ్లిసిటీ మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందే. ఏదో బాహుబలి వంటి సినిమాలకు పబ్లిసిటీ చేయకున్నా నడుస్తుంది. కాని నాని సినిమాలకు పబ్లిసిటీ చేయకుంటే ఆడటం కష్టం.
కాని ‘నిన్ను కోరి’ చిత్రానికి మాత్రం సరైన పబ్లిసిటీ చేయక పోవడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విడుదల దగ్గర పడుతున్నా కూడా ఇంకా ఏమాత్రం పబ్లిసిటీ జోరు పెంచలేదు. అడపా దడపా ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రెస్మీట్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో కాస్త ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప బుల్లి తెరపై అంటే ఛానల్స్‌కు యాడ్స్ ఇవ్వడం లేదు. బుల్లి తెరపై వచ్చే యాడ్స్‌తోనే సినిమా ఎక్కువ శాతం జనాలకు చేరుతుంది. ఆ విషయం చిత్ర యూనిట్ సభ్యులకు కూడా తెలుసు. కాని ఖర్చు వృదా ఎందుకు, మన సినిమాకు మస్త్ పబ్లిసిటీ వచ్చిందని నాని అండ్ టీం పెద్దగా పబ్లిసిటీపై శ్రద్ద పెట్టడం లేదు. ఇది ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. సినిమాపై నమ్మకంతోనే వీరు ఇలా చేస్తున్నారనిపిస్తుంది. చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో..!
మరిన్ని వార్తలు