నానిగాడు మరో హిట్‌ కొట్టినట్లే!!

Nani to become a hit from krishnarjuna yuddham

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత రెండు సంవత్సరాలుగా యంగ్‌ హీరో నాని ఫ్లాప్‌ అనే విషయాన్ని మర్చి పోయాడు. చేసిన ప్రతి సినిమా సూపర్‌ హిట్‌ లేదా సక్సెస్‌ అవుతూనే ఉంది. ఏకంగా ఏడు వరుస విజయాలు దక్కించుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్దం’. నాని గతంలో ఒకసారి డబుల్‌ రోల్‌లో కనిపించాడు. కాని ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు మరోసారి నాని డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన పూర్తి మాస్‌ మసాలా చిత్రం ఇది. ఈ చిత్రంతో నాని మరో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అని టీజర్‌ విడుదల తర్వాత తేలిపోయింది. ఇప్పటికే నాని రెండు పాత్రల లుక్‌లు విడుదల చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా టీజర్‌ను రివీల్‌ చేశారు.

నాని రెండు పూర్తి విభిన్న పాత్రల్లో నటించినట్లుగా టీజర్‌ చూస్తేనే అర్థం అవుతుంది. నానిలో ఉన్న మాస్‌ యాంగిల్‌ను పూర్తిగా వినియోగించుకుని దర్శకుడు మేర్లపాక గాంధీ దుమ్ము దులిపినట్లుగా అనిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్‌ చరణ్‌ రంగస్థలం విడుదలైన రెండు వారాలకు రాబోతున్న నాని మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని ఇప్పటికే ఖరారు అయ్యింది. ఈ చిత్రంలో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. భారీ క్రేజ్‌ ఉన్న ఈ చిత్రం అన్ని ఏరియాల్లో దుమ్ము దుమ్ముగా బిజినెస్‌ చేసింది. దాంతో విడుదలకు ముందే నిర్మాతకు లాభాల పంట పండినట్లుగా తెలుస్తోంది.