నాని మరో గుమ్మడికాయ కొట్టేశాడు

Nagarjuna and Nani multi-starrer to be directed by Sriram Aditya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ హీరో నాని వరుసగా సినిమాలకు కమిట్‌ అవ్వడం, అంతే స్పీడ్‌తో సినిమాలను పూర్తి చేయడం జరుగుతుంది. ఇటీవలే ‘ఎంసీఏ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని తాజాగా మరో సినిమాతో రెడీ అయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రంలో నాని పోషిస్తున్న రెండు పాత్రల ఫస్ట్‌లుక్‌లు రివీల్‌ అయ్యాయి. అలాగే ఒక పాటను కూడా విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌కు నాని గుమ్మడి కాయ కొట్టడంతో సినిమా అతి త్వరలో రాబోతుందని తేలిపోయింది.

వరుసగా రెండు చిత్రాలతో సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక నాని ద్విపాత్రాభినయం అవ్వడం వల్ల కూడా సినిమాపై ఆసక్తి నెలకొంది. గత కొంత కాలంగా అపజయం ఎరుగని నాని మరో విజయాన్ని ఈ చిత్రంతో అందుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఏప్రిల్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం విడుదల కాకుండానే నాగార్జునతో శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని నాని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.