దసరా పోరుపై క్లారిటీ

top Three movies To Compete During Dasara

ఈ దసరాకు భారీ ఎత్తున పోటీ ఖాయం అని సినీ వర్గాల వారు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. అయితే పెద్ద సినిమాలకు మినిమం గ్యాప్‌ ఉండేలా ముందే ప్లాన్‌ చేస్తున్నారు. దసరా సీజన్‌లో మొత్తం అరడజను సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఎన్టీఆర్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్‌ 19న విడుదల చేయాలని భావించారు. అయితే అదే సమయానికి రామ్‌ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఆ కారణంగానే ఎన్టీఆర్‌ చిత్రాన్ని వారం ముందే విడుదల చేయాలని నిర్ణయించారు. పోటీ ఉండవద్దనే ఉద్దేశ్యంతో నిర్మాతలు మాట్లాడుకుని ఈ నిర్ణయానికి వచ్చారు.

ఇక నాగార్జున మరియు నానిలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ముందు దసరాకు అనుకున్నప్పటికి ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రం కంటే వారం ముందే రాబోతుంది. ఇలా మూడు పెద్ద చిత్రాలు కనీసం వారం వారం గ్యాప్‌తో దసరా బరిలో నిలుస్తున్నాయి. దాంతో భారీ పోరు లేనట్లే అని, విడుదలైన చిత్రాలు అన్ని కూడా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం అంటున్నారు. ఈమూడు పెద్ద చిత్రాలతో పాటు మరో మూడు చిన్న చిత్రాలు ఈ చిత్రాల గ్యాప్‌లో లేదా ఈ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దసరాకు దాదాపు 15 రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. అందుకే నైజాం ఏరియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఎన్టీఆర్‌ చిత్రం భారీగా వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటున్నారు. సెలవులు ప్రారంభంకు ముందే సినిమాను విడుదల చేయడం వల్ల సెలవులను ఫుల్‌గా వాడేసుకోవచ్చు అనేది త్రివిక్రమ్‌ ప్లాన్‌.