ఎన్టీఆర్‌ స్థానంలో నాని అంగీకరించరు!

nani to host bigg boss season 2 show star maa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హిందీలో ‘బిగ్‌బాస్‌’ షో ఏ రేంజ్‌లో సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు పది సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బిగ్‌బాస్‌ షో తెలుగులో కూడా ఇటీవల మొదటి సీజన్‌ను పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. బిగ్‌బాస్‌ షోను హిందీలో సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ చేస్తున్నాడు. ఈయన దాదాపు ఆరు సీజన్‌లకు వరుసగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. బిగ్‌బాస్‌తో సల్మాన్‌కు, సల్మాన్‌తో బిగ్‌బాస్‌కు విపరీతమైన క్రేజ్‌ దక్కింది. ఇక తెలుగులో ఎన్టీఆర్‌ వల్ల కూడా బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్‌ దక్కి విశేష ఆధరణ పొందింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తారని అంతా భావించారు. కాని ఎన్టీఆర్‌ సినిమా కారణంగా రెండవ సీజన్‌ను అంగీకరించడం లేదు.

కాస్త సమయం ఇస్తే రెండవ సీజన్‌ను చేసేందుకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడట. కాని షో నిర్వాహకులు మాత్రం మొదటి సీజన్‌ సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో రెండవ సీజన్‌ను వెంటనే ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారీ స్థాయిలో రెండవ సీజన్‌ను ప్లాన్‌ చేస్తున్న నిర్వాహకులు ఎన్టీఆర్‌ నో చెప్పడంతో ప్రత్యామ్నాయంను వెదికే పనిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్‌ స్థానంలో నానిని తీసుకు వచ్చేందుకు స్టార్‌మా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నాని ఇప్పుడిప్పుడే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్న హీరో. ఆయనకు ఇంత భారీ షోను హోస్ట్‌ చేసే సత్తా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్‌ కూడా హోస్ట్‌ను బట్టి నిర్ణయించుకుంటారు. ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరో హోస్ట్‌గా వ్యవహరిస్తే స్టార్స్‌ సైతం బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు ముందుకు వస్తారు. నాని వంటి చిన్న హీరో హోస్ట్‌గా చేస్తే ఎక్కువ మంది సెలబ్రెటీలు ఆసక్తి చూపించరు. ప్రేక్షకులు కూడా మొదటి సీజన్‌లో ఎన్టీఆర్‌ను చూసి, ఇప్పుడు నానిని చూడమంటే ఆసక్తి ఖచ్చితంగా చూపించరు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా రెండవ సీజన్‌ చేయడమే బెటర్‌ అని కొందరు సలహా ఇస్తున్నారు. నిప్పులేనిదే పొగ రాదు, నానిని స్టార్‌ మా వారు సంప్రదించి ఉంటారు, అందుకే నాని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. స్టార్‌ మా వారి నిర్ణయం ఏది అయినా కూడా ఎన్టీఆర్‌ స్థాయిలో నాని ఆకట్టుకోవడం దాదాపు అసాధ్యం. బిగ్‌బాస్‌ షోకు వారాంతంలోనే ఎక్కువ రేటింగ్‌ వస్తుంది. ఒక వేళ నాని షో చేస్తే ఆ రేటింగ్‌ కూడా వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.