సీఐడీ విచారణకు టీడీపీ అగ్రనేత నారా లోకేష్ హాజరయ్యారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకుని నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. కరకట్ట ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన విచారణకు నారా లోకేష్ హాజరయ్యారు.
ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు లోకేష్ ను సీఐడీ విచారించనుంది. కాగా IRR కేసులో A-14గా నారా లోకేష్ ఉన్నారు. ఈ మేరకు గత 10 రోజుల కిందట నారా లోకేష్ కు ఢిల్లీకి వెళ్లి మరీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.