Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతాడని తెలుసుకునే లోకేష్ తమ కుటుంబ ఆస్తుల ప్రకటన కూడా అదే రోజు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది కాకతాళీయంగా జరిగింది కాదు. ఓ వ్యూహం ప్రకారమే జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు శుక్రవారాన్ని లోకేష్ వాడుకున్నారు. ఆస్తుల ప్రకటన సందర్భంగా జగన్ కి షాక్ ఇచ్చేలా లోకేష్ చేసిన కామెంట్స్ మీరే చూడండి.
-
ప్రతిపక్ష పార్టీ కూడా ఈ విధానాన్ని ప్రారంభించాలి.
-
జగన్ కూడా ఇదే విధంగా ఆస్తులు ప్రకటించాలి.
-
మేం స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటిస్తున్నాం.
-
జగన్ ఆస్తులను సీబీఐ ప్రకటిస్తోంది.
-
ఏడేళ్లుగా ఇదే విధంగా ఆస్తులు ప్రకటిస్తున్నాం.
-
మాపై విమర్శలు చేసే వాళ్ళు ఏనాడైనా వారి ఆస్తులు ప్రకటించారా ?
-
వారసులుగా మేం సమర్ధంగా పని చేయకుంటే రాజకీయాల్లో నిలబడలేము.
-
వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తవమే… అయితే ప్రజామోదం ఉంటేనే నిలబడగలం.
-
జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో తెలియదు.
-
అసెంబ్లీలో మేమే ప్రతిపక్షంగా వ్యవహరించాం.
-
కాంగ్రెస్ అధికారంలో ఉండగా పునరావాస ప్రక్రియను ఎందుకు పూర్తి చేయలేదు.
-
పవన్ కళ్యాణ్ పోలవరం పూర్తి కావాలని మాట్లాడారు.
-
పోలవరం పూర్తి కాకూడదని వైసీపీ నేతలు దేవుణ్ణి ప్రతి రోజూ ప్రార్ధిస్తున్నారు.
-
అసెంబ్లీలో పోలవరం సహా అన్ని చర్చించాం.
-
అసెంబ్లీకి వచ్చి చర్చించి ఉంటే పోలవరం గురించి అన్ని విషయాలు తెలిసి ఉండేవి.
-
అసెంబ్లీకి రాకుండా అఖిలపక్షం అంటూ వైసీపీ డిమాండ్ చేయడం తగదు.
-
ఇవాళ శుక్రవారం మేము ధైర్యంగా ఆస్తులు ప్రకటించాం
-
జగన్ పాదయాత్ర ఆపి అవినీతి కేసులో ఇవాళ న్యాయస్థానానికి హాజరవుతున్నారు
-
ఈ రెండిటి కి మధ్య తేడా ను ప్రజలు గమనిస్తున్నారు
-
జగన్ ఆస్తులను సీబీఐ, ed లు ప్రకటిస్తున్నాయి
-
జగన్ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదు.
-
వై.ఎస్. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు హెరిటేజ్ పై 17కేసులు వేశారు
-
ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు.
-
పోలవరం, స్పెషల్ ప్యాకేజీ ఏపీ హక్కు.
-
కేంద్రం అసలేం చేయడం లేదనడం కరెక్ట్ కాదు.
-
కేెెంద్రానికి-రాష్ట్రానికి, టీడీపీ-బీజేపీకి మధ్య గ్యాప్ లేదు.
-
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ, చంద్రబాబు కృషి చేశారు.
-
మెట్రో, హైటెక్ సిటీ, హెచ్ఐసీసీ ప్రాంగణం వంటివి రూపొందించింది చంద్రబాబే.
-
రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం బాధ్యతలో భాగం.
-
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో జరిగే కార్యక్రమాలకు పిలవకపోయినా భాదపడాల్సిన అవసరం లేదు.
-
ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం జడ్జీ ముందు చేతులు కట్టుకుని నిలబడడం జగనుకు అలవాటై పోయింది.. ఇది కొత్త విషయమేమీ కాదు.
-
అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆస్తులు ప్రకటించి విమర్శలు చేస్తే మంచిది.
-
సమస్యల పరిష్కారానికి నన్ను కలిసినందుకే ఎంపీ బుట్టా రేణుకను పార్టీ మాకుతున్నారంటూ వైసీపీనే ప్రచారం చేసింది.
-
మా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా లేఖ రాయలేదు.
-
టీడీపీ ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంట పడతారు.
-
కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ స్టాండ్ ఏంటో ఇప్పటికీ వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పలేదు.
-
బోయలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేశాం… దాని గురించీ వైసీపీ ఏం మాట్లాడ్డం లేదు.