నేడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి పయనం కానున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు నేపథ్యంలో నారా లోకేష్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ పార్టీ నేతలు. నారా లోకేష్ అక్కడే వారం రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉంది.
ఇది ఇలా ఉండగా, చంద్రబాబు అరెస్ట్ తరుణంలో.. మరో వినూత్న కార్యక్రమానికి టీడీపీ పార్టీ శ్రీకారం చుట్టింది. నేడు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ క్రాంతితో క్రాంతి వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు నిచ్చింది. ఇవాళ రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు లేదా సెల్ఫోన్ టార్చ్ వెలిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు. ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి ఐదు నిమిషాలు లైట్లు వెలిగించాలని పిలుపు నిచ్చారు. నారా లోకేష్ రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని పిలుపు నిచ్చారు.