ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, అధికార వైసీపీ పార్టీ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరిలో కూడా అధికార వైసీపీ పార్టీ పై ఒకరకమైన వ్యతిరేకత మొదలైందని, మరికొద్దిరోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగు అవుతుందని సంచలన వాఖ్యలు చేశారు. కాగా ఈ నేపథ్యంలో నారాలోకేష్ అధికార వైసీపీ ప్రభుత్వంపై కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వైకాపా మేనిఫెస్టోలో రాజధాని ఐ అమరావతి నుండి మారుస్తామని ఎందుకు ప్రకటించలేదని నారా లోకేష్ ప్రశ్నించారు. కాగా మంగళవారం నాడు గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నారా లోకేష్ ఒక సభ నిర్వహించారు.
ఇకపోతే ఆంధ్రులు ఎంతగానో కళలు కని రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చారని, అందుకనే తమ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని, అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధికై, అన్ని జిల్లాల అభివృద్ధికై పరిశ్రమలు నెలకొల్పారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాజధాని అమరావతి ప్రాంతంలో 25 మంది రైతులు చనిపోతే, ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు.