Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా, విభజన హామీలు అనే అంశం మీదనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ చేసిన అన్యాయానికి మేము న్యాయం చేస్తానని ముందుకు వచ్చిన మోడీ ఆ విషయం మీద మొండి చేయి చూపడంతో ఎన్డీయే నుండి బయటకు వచ్చిన చంద్రబాబు కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ గేం ప్లానో లేక చంద్రబాబుని తిడితే వచ్చే ఎన్నికల్లో లాభామనుకున్నారో గానీ జగన్ పవన్ లు మోదీనీ బీజేపీ ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. అయితే ఇదే సమయంలో లోకేష్ మీద అయితే విరుచుకుపడుతున్నారు లోకేష్ అవినీతిపరుడని వ్యాఖ్యలు చేస్తున్న్నారు. కానీ దాని మీద చర్చకు సిద్దం అని ప్రకటిస్తే అసలు ఆ ఊసే ఎత్తకుండా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీకి లోకేష్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి జూన్ 2కి 4ఏళ్లు పూర్తి అయ్యింది. అటు తెలంగాణలో సంబరాలు చేసుకుంటుంటే.. ఇటు ఏపీలో నవ నిర్మాణ దీక్ష పేరుతో సభలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అందులో ‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్‌కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ‘డియర్ నరేంద్ర మోదీ సార్.. మీ ట్వీట్‌తో హక్కుల విషయంలో రగిలిపోతున్న ఏపీ శాంతిస్తుందని భావించారు.. కాని ఒక్కసారి మీ ట్వీట్ కింద ఉన్న కామెంట్స్‌ను కూడా ఒక్కసారి గమనించండి. ఈ ట్వీట్ సోమవారం నాడు మీకు నిరాశ కలిగించదని భావిస్తున్నా’ అన్నారు మంత్రి. ఈ ట్వీట్‌తో పాటూ కొన్ని స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేసి ఏపీ ప్రజల ఆవేదనను తెలియజెప్పే ప్రయత్నం చేశారు మంత్రి. ఇంకేముంది లోకేష్ మీద కూడా ఐటీ దాడులు, సీబీఐ ఎంక్వైరీలు వేస్తున్నారని పవన్ జగన్ లు ఊదరగొడుతున్న సమయంలో రాష్ట్రంలో మరే నాయకుడు మోడీకి కౌంటర్ ఇవ్వని తరుణంలో లోకేష్ చూపిస్తున్న దూకుడు ఇప్పుడు చర్చనీయంసంగా మారింది.
Dear @narendramodi Sir, if you thought your tweet could cool down AP that's on the boil for its rights, you must read the comments section which I have attached (only a few) for your perusal. Hope it doesn't spoil your Monday #APDemandsSpecialStatus #APDemandsJustice #MondayBlues pic.twitter.com/48nx981QKR
— Lokesh Nara (@naralokesh) June 4, 2018