యధా రాజా తదా ప్రజా అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది, దానికి అర్ధం రాజు ఎలా ఉంటె ఆయన నడవడికను బట్టే ప్రజలు కూడా నడుచుకుంటారు అని. విన్నప్పుడు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఇదే విషయాన్ని ఇప్పుడు ఋజువు చేశాడు, పన్నెండేళ్ళ బుడతడు. ఎందుకంటే విద్యా రంగంలోకి వచ్చేప్పటికి ఇక్కడ రాజులు ఉపాధ్యాయులు ప్రజలు విద్యార్ధులు, పాట్య పుస్తకాలు కాకుండా మిగతా విషయాలు టీచర్లు ఏమి చెబితే అదే నిజమని నమ్మే వయసు అది. మరి ఆ నారాయణ స్కూల్ టీచర్లు ఇతరులకు సహాయం చేయడం గురించి ఎంతలా చెప్పి ఉంటారో, ఇటీవల కేరళ జల విళయం గురించి విన్న ఓ ఆరవ తరగతి విద్యార్ధి తన కిడ్డీ బ్యాంక్ లోని డబ్బంతా వారికి ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.
అతనే అనూజ్ కార్తిక్ చెన్నైలోని నారాయాణ ఒలంపియాడ్ స్కూల్ లో చదువుతున్న బాలుడు తన కిడ్డీ బ్యాంక్ నుండి డబ్బు ఇద్దామని తల్లిదండ్రులకి చెప్పాడు. వారు కేరళకు నిధులు పోగుచేస్తున్న ఓకే సంస్థను సంప్రదించారు. ఈ విషయమంతా కేరళ సిఎం పినరయి విజయన్ కు తెలిసింది. దీంతో అయన ఆ బాలుడ్ని కేరళ పిలిపించుకుని మరీ అభినందించారు.