Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎట్టకేలకు ఆర్బీఐ చేతులు దులిపేసుకుంది. తన నెత్తి మీద ఉన్న కొండంత భారాన్ని కేంద్రం మీదకు నెట్టేసింది. నోట్ల రద్దు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కున్న ఆర్బీఐ.. రద్దైన నోట్ల వివరాలు, వెనక్కు వచ్చిన డబ్బు, కొత్త నోట్ల పంపిణీ వంటి వాటిపై అధికారిక గణాంకాలు విడుదల చేసింది. కానీ నోట్ల రద్దు వల్ల నల్లధనం తగ్గిందో లేదో మాత్రం చెప్పలేకపోయింది.
నిజంగా నోట్ల రద్దు పారదర్శకతను తీసుకొస్తే.. మొన్నటికి మొన్న జరిగిన ఉపఎన్నికల్లో పార్టీలన్నీ వందల కోట్ల రూపాయలు ఎలా ఖర్చుపెట్టాయనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. అంతెందుకు యూపీలో నోట్లరద్దు సమయంలో ఎన్నికలు జరిగినా.. బీజేపీ యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేసింది. ఇలా ఎవరైతే అక్రమాలు చేస్తారో వారికి కళ్లేలు వేయలేనప్పుడు ఇక నోట్ల రద్దు చేసి ఉపయోగమేంటో.
శ్రీ మోడీ, జైట్లీ నోట్ల రద్దు కారణంగా దేశం వెలిగిపోతోందని కథలు చెబుతున్నారు. పైగా పన్నులు కట్టేవాళ్ల సంఖ్య పెరిగిందని కాక్ అండ్ బుల్ స్టోరీస్ వినిపిస్తున్నారు. జనం నమ్మినా, నమ్మకపోయినా వినాలి కాబట్టి వింటున్నారంతే. కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా.. బీజేపీకి మళ్లీ సింగిల్ డిజిట్ సీట్లు రావడం ఖాయమనేది విశ్లేషకుల మాట. కానీ కాంగ్రెస్ రోజురోజుకీ కుచించుకపోవడంతో… మోడీ ఆటలు సాగుుతన్నాయ్ అంతే.
మరిన్ని వార్తలు: