2024 వరకు ఫిక్సైపోయారా..?

Narendra Modi is the BJP's supporter of power till 2024

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశంలో ఎన్ని సమస్యలున్నా.. ప్రధాని మోడీయే బలమైన నేతగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఎంత ప్రయత్నించినా మోడీ దరిదాపులకు కూడా రాలేకపోతున్నారు. పైగా ఆయన ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

రాహుల్ పై జనానికే కాదు సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదు. అలాంటప్పుడు ఆయన మోడీని ఎలా ఢీకొడతారని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మోడీ పేరు మీదే అన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందిర తరహాలో స్థానిక ఎన్నికల ఫలితాలను కూడా మోడీ ప్రభావితం చేస్తున్నారు.

ఒడిషా, కేరళ ఇలా ఎక్కడ జరిగినా స్థానిక ఎన్నికలు మోడీ చుట్టూ తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజల్ని మోడీ ప్రభావితం చేస్తున్నారు. మన్ కీ బాత్ సూపర్ హిట్టైంది. ట్వీట్ల సంగతి లెక్కే లేదు. అందుకే 2024 వరకు తమదే అధికారమని బీజేపీ ఖాయంగా చెప్పుకుంటోంది.

మరిన్ని వార్తలు:

ఎన్నారైలకు కీలక పదవులిస్తున్న ట్రంప్