Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓవైపు కశ్మీర్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు చైనా సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులూ పెరుగుతున్నాయి. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అంతకు ముందు కంటే దారుణంగా పరిస్థితులు విషమించాయి. మోడీ కశ్మీర్ హీరోగా మారడం లోకల్ పార్టీలకు ఇష్టం లేదనే వాదన కూడా ఉంది.
అందుకే బీజేపీ తరపున డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న.. భాగస్వామి పీడీపీ నేతలు మాత్రం వెనక్కులాగుతున్నారనే విషయం గత మూడేళ్లుగా అనుభవంలోనే ఉంది. కనీసం ఇప్పటికైనా కశ్మీర్ కాష్ఠాన్ని ఆర్పే ప్రయత్నం చేయడం లేదు సీఎం ముఫ్తీ. మరోవైపు చైనా ప్రమాదకరంగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఒకేసారి భారత్ ను తాము, పాక్ కలిసి దెబ్బకొట్టాలని స్కెచ్చేస్తోంది.
అందుకే మోడీ సర్కారు కూడా రెండుచోట్లా ఒకేసారి యుద్ధానికి సన్నహాలు చేసుకుంటోంది. భారీగా రక్షణ సామగ్రిని కొనుగోలు చేస్తోంది. అణ్వస్త్ర పాటవాన్ని పెంచుకుంటోంది. దీంతో పాటు దౌత్యమార్గాల్లోనూ ఒత్తిడి పెంచుతోంది. చైనా, భారత్ తాజా వివాదంలో ప్రపంచమంతా భారత్ వైపే ఉందని సుష్మ పార్లమెంటులో చెప్పడంతో డ్రాగన్ తీవ్ర ఒత్తిడిలో పడింది. మరి ఈ సమస్యను మోడీ ఎలా పరిష్కరిస్తారనేదాన్ని బట్టే.. ఆయన రాజకీయ చాతుర్యం ఆధారపడి ఉంటుంది.
మరిన్ని వార్తలు