Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Narendra Modi Orders GST Council To Ensure Implementation
ప్రధాని మోడీ దేశాన్ని ఉద్ధరిస్తానంటారు. కానీ ఆయన చేసే పనుల కారణంగా జనం మాత్రమే ఇబ్బందిపడుతున్నారు.
మొన్నటికి మొన్న నోట్ల రద్దుతో జనాన్ని కష్టాల పాలుచేసిన మోడీ.. ఇప్పుడు జీఎస్టీ పేరుతో లేనిపోని అయోమయం సృష్టిస్తున్నారు. నోట్లరద్దుతో నల్లధనం ఉండదన్న మోడీ మాటలు ఎంతవరకూ నిజమో అందరికీ తెలుసు. ఇప్పుడు జీఎస్టీ కూడా అంతే ఉండనుంది.
నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ గా అభివర్ణించిన నోట్ల రద్దు అట్టర్ ఫ్లాపైందనేది అధికారుల మాట. ఊహించిన విధంగా బ్లాక్ మనీ తగ్గకపోగా.. రెండు వేల నోటుతో అది ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు చేతులు కాలాక రెండొందల రూపాయల నోటు తెస్తున్నామని ఆర్బీఐ చెబుతోంది. నోట్లరద్దు కు ప్రత్యేకంగా సిద్ధం కాలేదని పార్లమెంటరీ కమిటీ ముందు ఆర్బీఐ గవర్నరే ఒప్పుకున్నారు. అది పొలిటికల్ నిర్ణయమని కొందరు ఉన్నతాధికారులే తేల్చారు.
నోట్లరద్దు అనుభవాలతో జీఎస్టీకి జాగ్రత్తపడాల్సింది పోయి.. కనీస అవగాహన లేకుండా మళ్లీ మొండిగా ముందుకెళ్తున్నారు మోడీ. జీఎస్టీకి వ్యాపారులు తయారవలేదు సరే.. అసలు ప్రభుత్వం సిద్ధమైందా అంటే లేదనే చెప్పాలి. ఇంతవరకూ జీఎస్టీ సాఫ్ట్ వేర్ కానీ, అప్లికేషన్లు కానీ ఫైనలైజ్ కాలేదు. కానీ అనుకున్న సమయానికి ప్రారంభించాలన్న ఆత్రమే మోడీ మరో సాహసానికి ప్రేరేపించేలా చేస్తోంది. మోడీ తీరు చూస్తుంటే.. ఆయనకు చెలగాటం, జనానికి ప్రాణసంకటంలా ఉంది.
మరిన్ని వార్తలు:
సంపాదించడమే కాదు ఇవ్వడమూ తెలిసిన చౌదరి గారు.
ఒంటరి స్త్రీ కి హైదరాబాద్ హోటల్ లో అవమానం… NRI స్పెషల్