Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇన్నాళ్లూ పార్లమెంటు సమావేశాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో బిజీగా గడిపిన ప్రధాని.. కాస్త రిలాక్సయ్యారు. ఈ గ్యాప్ లోనే గవర్నర్లు, కేంద్ర మంత్రివర్గంలో ఖాలీలను భర్తీ చేయాలని డిసైడయ్యారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలకు గవర్నర్లు లేదు. పైగా కీలక రక్షణ శాఖకు కూడా పూర్తిస్థాయి మంత్రి లేరు. అందుకే ఇమ్మిడియట్ గా పదవుల భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కేంద్ర క్యాబినెట్ లో జేడీయూ, అన్నాడీఎంకేలకు చెరో సీటు ఇవ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఓ మంత్రి పదవి దక్కే ఛాన్సుంది. ప్రస్తుత మంత్రుల్లో కూడా కొందరిని పక్కనపెట్టేయాలని డిసైడయ్యారు. వివాదాల్లో కూరుకున్న ఎవర్నీ తీసుకునే ప్రసక్తే లేదట. పొలిటికల్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. కేవలం సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీమ్ రెడీ చేస్తారట.
గవర్నర్ల విషయంలో కూడా కొందరు పాతమిత్రులకు ఇచ్చిన పాత హామీల దుమ్ము కూడా దులుపుతున్నారు. దాదాపు పది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాల్సి ఉంది కాబట్టి.. టీటీడీపీ నేత మోత్కుపల్లికి ఛాన్స్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్లు, మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు, బ్యాంకుల నామినేటెడ్ పోస్టులు, ఎలక్షన్ కమిషనర్ పోస్టు కూడా ఫిల్ చేస్తారట.
మరిన్ని వార్తలు: