మహానటి, గోవిందం దారిలోనే నర్తనశాల…!

Narthanasala To Release On August 30

టాలీవుడ్‌లో గత దశాబ్దం కాలంగా ట్రైలర్‌ ట్రెండ్‌ దాదాపు అన్ని సినిమాలకు ఫాలో అవుతున్నారు. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ట్రైలర్‌ను విడుదల చేయడం ద్వారా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. స్టార్‌ హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల వరకు దాదాపు అంతా కూడా ట్రైలర్‌ను విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన రెండు చిత్రాలు మాత్రం ట్రైలర్‌ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కేవలం టీజర్‌తో సినిమా గురించి ప్రేక్షకులకు చెప్పి, వారు సినిమాను విడుదల చేయడం జరిగింది. ఆ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ చిత్రాలే మహానటి, గీత గోవిందం. ఇప్పుడు అదే దారిలో ‘నర్తనశాల’ చిత్రం కూడా నడవబోతుంది.

narthanasala

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన నర్తనశాల చిత్రం టీజర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయడం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఆగస్టు 30న విడుదల కాబోతున్న నర్తనశాలకు పెద్దగా పోటీ లేకపోవడం కూడా ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. గీత గోవిందం చిత్రంకు ఎలాంటి పోటీ లేని సమయంలో విడుదల తేదీ దక్కింది. ఇప్పుడు నర్తనశాలకు ఉన్న శైలజ రెడ్డి అల్లుడి పోటీ తొలగి పోయింది. ఈ నేపథ్యంలో నర్తనశాల భారీ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. మరి సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

narhanasala