National Politics: ఇస్రో RLV LEX-02 ల్యాండింగ్‌ ప్రయోగం విజయవంతం

National Politics: ISRO RLV LEX-02 Landing Launch Successful
National Politics: ISRO RLV LEX-02 Landing Launch Successful

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌’ అటానమస్‌ ల్యాండింగ్‌ ప్రయోగాన్ని (RLV LEX-02) విజయవంతంగా చేపట్టింది. ఈరోజు ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌)లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఆర్‌ఎల్‌వీ దోహదపడనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్‌ఎల్‌వీకి ఇస్రో ‘పుష్పక్‌’గా నామకరణం చేశారు. గత ఏడాది ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌-01ను పూర్తి చేసిన ఇస్రో.. స్వతంత్ర ల్యాండింగ్‌లో పుష్పక్‌ సామర్థ్యాన్ని ఎల్‌ఈఎక్స్‌-02 ద్వారా మరోసారి పరీక్షించింది. ఐఏఎఫ్‌కు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌లో ఆర్‌ఎల్‌వీని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెటట్టగా.. అవరోధాలన్నింటినీ సరిదిద్దుకుంటూ నిర్దేశిత మార్గంలోకి వచ్చిన ఆర్‌ఎల్‌వీ స్వయంగా ల్యాండయింది. అత్యంత కచ్చితత్వంతో రన్‌వేపై దిగిన ఈ వాహక నౌక.. ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్స్‌, బ్రేక్‌ పారాచూట్‌, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ సిస్టమ్‌ సాయంతో తనకు తానే ఆగిపోయింది.