ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ది సహజ మరణం కాదని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడయిన విషయం తెలిసిందే. దీనిపై హత్యకేసు నమోదుచేసిన పోలీసులు, క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో రోహిత్ భార్య అపూర్వతోపాటు మరో వ్యక్తికి ప్రమేయం ఉన్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. మరో మహిళతో రోహిత్ వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక, తన ఆస్తిలో కొంత భాగం ఆమె కుమారుడికి ఇవ్వడానికి సిద్ధపడటం వల్లే ఈ హత్యకు దారి తీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ శనివారం రోహిత్ భార్యను పోలీసులు ఎంక్వైరీ చేయగా పోలీసుల ప్రశ్నలకు అపూర్వ పొంతనలేని సమాధానం ఇచ్చారు. నిజనికి రోహిత్, అపూర్వ గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరికి తొలి రోజు నుంచే గొడవ పడుతూనే ఉన్నారని రోహిత్ తల్లి ఉజ్వల అంటున్నారు. ప్రేమ వివాహమైనా వారిద్దరి మధ్య సఖ్యత లేదని, మరోవైపు రాజకీయంగా ఎదగలేకపోతున్నానని తన కొడుకు రోజూ మదనపడేవాడని రోహిత్ కి వరసకు సోదరుడు అయ్యే రాజీవ్ భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్టు పెళ్లైన రెండో రోజే అపూర్వ ఆరోపించి, గొడవపడిందని ఉజ్వల పేర్కొన్నారు. అలాగే, అపూర్వ కూడా ఓ వ్యక్తితో కొద్ది రోజుల నుంచి చాలా చనువుగా ఉందంటూ ఆమె పోలీసులకు వివరించారు. అయితే దీని మీద పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది.