నూతన నాణేలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం తెలిపింది. రూ. 1, 2, 5, 10 నాణేలతోపాటు రూ. 20 నాణేలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 7న (ఆదివారం) నూతన నాణేలను ఆవిష్కరిస్తారు. దృష్టిలోపం ఉన్నవారు కూడా సులభంగా గుర్తించే విధంగా కొత్తనాణేలను రూపొందించారు. త్వరలోనే నూతన నాణేలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రబడ్జెట్ 2019-20 ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు.