ఫేస్‌బుక్ భారత్‌లో డిజిటల్ వ్యాలెట్ వాట్సాప్ పే ను లాంచ్ చేసే సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో వాట్సాప్ పే టెస్ట్ రన్ విజయవంతం అయిందని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తెలిపారు. వాట్సాప్ పే ను ప్రయోగాత్మకంగా ఒక మిలియన్ యూజర్లు ఉపయోగించారు అని తెలిపుతూ త్వరలోనే శుభవార్త అందిస్తామని తెలియ చేశారు. ఆర్బీఐ నిబంధనల కారణంగా ఇంకా డాటా లోకలైజేషన్ నియమాల వల్ల వాట్సాప్ పే భారత్‌లో ఇంకా లాంచ్ కాకుండా ఆగిపోయింది అని జూకర్ బర్గ్ చెప్పారు.
భారత్‌లో ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తూ భారత్‌లో దీనిని త్వరలోనే లాంచ్ చేస్తామని అనలిస్టులతో అన్నారు. దేశంలోని 40 కోట్లమంది వాట్సాప్ యూజర్లకు యూపీఐ ఆధారిత వాట్సాప్ పే సర్వీస్ అందుబాటులోకి రానుంది. తద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులకి డిజిటల్ చెల్లింపులు సులభంగా అవుతాయని తెలియచేశారు.